RR: కొందుర్గు మండల కేంద్రంలో సంచార పశు వైద్యశాల వాహనాన్ని జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జాన్ షాహిద్ జిల్లా కోఆర్డినేటర్ రాజబాబు తనిఖీ చేశారు. పశు వైద్య వాహనంలోని సిబ్బంది పశువులకు చికిత్స చేసే విధానాన్ని పరిశీలించారు. మందులు, రికార్డులను పరిశీలించి సరైన సమయంలో చికిత్స అందించాలని సూచించారు. మండల పాడి రైతులు 1962 సేవలను వినియోగించుకోవాలని కోరారు.