ఉదయం పూట యోగా చేయడం వల్ల వెన్నెముక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కూర్చోవడం, నడవడం వంటివి మరింత సహజంగా అనిపిస్తాయి. రోజూ యోగా చేస్తే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. 10 నిమిషాలు యోగా చేయడం వల్ల త్వరగా స్పందించే గుణం తగ్గుతుంది. దీంతో కోపం, ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఆలోచించే గుణం పెరుగుతుంది. యోగా శరీర ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.