బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబైలో ఓ మ్యూజిక్ ఈవెంట్కు వెళ్తున్న ఆమె కారును అంబోలీలోని లింక్ రోడ్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో వేగంగా ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నోరాకు స్వల్ప గాయాలు కాగా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.