W.G: గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని తణుకు ఎక్సైజ్ సీఐ సత్తి మణికంఠరెడ్డి హెచ్చరించారు. నిన్న ప్రగతి కళాశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ రహిత తణుకు లక్ష్యంగా యువత మేల్కోవాలని కోరారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.