KRNL: ఈ నెల 22 నుంచి 27 వరకు మధ్యప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి అండర్-14 హాకీ పోటీలకు కర్నూలు నగరానికి చెందిన టీ. సంకీర్తన ఎంపికైంది. శనివారం ఆమె తల్లిదండ్రులు వినీల, సత్యకుమార్ ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొని, ప్రతిభ చాటిందని, ఆమె విజయంలో హాకీ కోచ్ భార్గవి కృషి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.