KDP: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఇవాళ మైదుకూరు మేధా డిఫెన్స్ అకాడమీలో జాబ్ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హాజరైన ఈ మేళాలో కియా, హెటిరో సహా 16 కంపెనీలు పాల్గొన్నాయి. 416 మంది హాజరు కాగా, 174 మంది ఎంపికయ్యారు. నిరుద్యోగ యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.