SRD: జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి పట్టణం గంజి మైదానంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి పాల్గొన్నారు.