HYD: నగరంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీపీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవగాహన కార్యక్రమాలు పెరిగాయి. సీపీ ఆదేశాల మేరకు వారంలో 2 రోజులు (మంగళ, శనివారాలు) వివిధ ప్రాంతాల్లో స్థానిక పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు సత్ఫలిస్తున్నాయని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.