ATP: తాడిపత్రిలో వైసీపీ అధినేత YS జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.