KRNL: కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.ఎ.సిరి ఆదివారం తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిలోనూ పీజీఆర్ఎస్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.