JN: పాలకుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి వెల్తూరి నగేష్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆదివాసుల మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు నడిగడ్డ శైలజ నేడు జనసేన పార్టీలో చేరారు. ఆమెతో పాటు మరో 50 మంది మహిళలు పార్టీలో చేరారు. నగేష్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.