భారతీయ రైల్వే ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్డినరీ క్లాస్లో 215కిలో మీటర్ కంటే తక్కువ దూరం ప్రయాణాలకు ఛార్జీలను పెంచలేదు. అయితే అంతకుమించిన దూరపు ప్రయాణాలకు ఆర్డినరీ క్లాస్లో కి.మీ.కు 1 పైసా.. మెయిల్/ఎక్స్ప్రెస్ నాన్-AC, ACలకు కి.మీకు 2 పైసల చొప్పున ఛార్జీలను పెంచినట్లు పేర్కొంది. ఈ నెల 26 నుంచే ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపింది.