ATP: ఎల్లనూరు మండలం నిట్టూరులో చెరువుగట్టపై ముళ్లకంపలు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తున్నాయి. చెరువు కట్ట బలహీనపడి దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చెరువు కట్టపై ఉన్న ముళ్ళ పొదలను తొలగించాలన్నారు. ప్రస్తుతం చెరువులో మరమ్మత్తు పనులు జరుగుతున్న ముళ్లపొదలను తొలగించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.