PLD: స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం చిలకలూరిపేట పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన శుభ్రత పనులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. వీధులు, కాలువల శుభ్రతను స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛతా దినోత్సవంలో పాల్గొని ప్రజలతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.