WNP: శ్రీ వాసవి సేవా సమితి నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ ప్రశంసించారు. శనివారం కలెక్టరేట్లో సమితి వారు ముద్రించిన నూతన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. క్యాలెండర్ను ఆకర్షణీయంగా రూపొందించినందుకు జాతీయ అధ్యక్షులు డాక్టర్ పూరి సురేష్ శెట్టిని అభినందించారు.