NLR: మనందరం బాధ్యతగా తీసుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు.శనివారం కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో 18వ వార్డులో ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు.