TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు చేరుకున్నారు. గతంలో ఓయూ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణ నిమిత్తం ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ మూడు కేసుల విచారణను ప్రజాప్రతినిధుల కోర్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసింది.