EG: సాయుధ దళాల జెండా దినోత్సవం(2024-25) సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జెండా విక్రయాలు, హుండీలు, విరాళాల ద్వారా మొత్తం రూ. 12,73,105 నిధులు సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ సేకరణతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా మూడవ స్థానంలో నిలిచిందని కలెక్టర్ వెల్లడించారు.