GDWL: కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కనుమరుగు చేసే కుట్ర పన్నుతోందని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి ఆరోపించారు. మహాత్మా గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. 2005లో యూపీఏ ప్రభుత్వం రైతు కూలీల సంక్షేమానికి చేపట్టిన పథకాన్ని పేరు మార్పిడతో నీరుగార్చుతున్నారని మండిపడ్డారు.