ATP: మాజీ సీఎం YS జగన్ జన్మదినం సందర్భంగా నార్పలలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా యువకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ఒక ప్రాణాన్ని కాపాడే రక్తదానమే జగనన్నకు ఇచ్చే అసలైన పుట్టినరోజు కానుక అని శైలజానాథ్ పేర్కొన్నారు. రక్తదాతలకు జగన్ సంతకంతో కూడిన ప్రశంసా పత్రాలను అందజేశారు.