KMM: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎడవల్లి రామ్ రెడ్డి పార్థివ దేహానికి సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, నున్న నాగేశ్వరరావు నివాళులర్పించారు. శనివారం పాలేరులోని ఆయన నివాసానికి చేరుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రామ్‌రెడ్డి మరణం బాధాకరమని, మంచి మిత్రుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.