WGL: వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో పర్వతగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి గాయపు లింగారెడ్డి పాల్గొని, విద్యార్థులు వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముగ్గురు విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.