SRD: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని వాసర్ సర్పంచ్ బిరాదార్ హనుమంతు అన్నారు. శనివారం సిర్గాపూర్ మండలంలోని వాసర్ పాఠశాలను స్థానిక ఉప సర్పంచ్ విట్టల్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల GHM మంజులాదేవి, టీచర్లతో సమావేశమై విద్యా బోధన అభ్యసన అభివృద్ధిపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీచర్లు సర్పంచ్ ఉప సర్పంచ్లకు సన్మానించారు.