WGL:నర్సంపేట మండల కేంద్రంలోని దాసరి పల్లెకు చెందిన నవీన్ అనే యువకుడు ఈ నెల 17న అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం కమ్మపల్లి వెళ్లే రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావిలో నవీన్ మృతదేహం గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.