కృష్ణా: కంకిపాడు పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న రాము కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల అతని కాలుకి ఆపరేషన్ చేసి వేళ్లు తొలగించారు. విషయం తెలుసుకున్న కంకిపాడు పోలీస్ సిబ్బంది, ఆయన ఆరోగ్య అవసరాల నిమిత్తం సహాయంగా కొంత ఆర్థిక మొత్తాన్ని సేకరించి, జె.మురళీ కృష్ణ చేతుల మీదుగా హోమ్ గార్డ్ రాముకు అందించారు.