సత్యసాయి: బుక్కపట్నం చెరువులో నీటి మట్టం పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సూచించారు. ఈత రాని వారు, మహిళలు, చిన్నారులు చెరువు వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు. మరువ పారుతున్న నీటిలోకి ఎవరూ దిగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భద్రత దృష్ట్యా చెరువు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.