NLR: బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యాప్తంగా ఉదయం నుంచి పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైంది. మండలంలోని దామరమడుగు గ్రామం అరుంధతి వాడలో జరిగే పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు.