TG: మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ వచ్చారు. రేపు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. రాష్ట్ర జలాల హక్కులు, రైతుల సమస్యలు వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇవాళ బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసంలో బస చేయనున్నారు.