KDP: వల్లూరులో ఇవాళ మండల కంప్యూటర్ సెంటర్లో ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఫైళ్లను ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదిశేషారెడ్డి పరిశీలించారు. ఉపాధి హామీ పథకాన్ని నిబంధనల ప్రకారం పారదర్శకంగా అమలు చేయాలని, కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామీణ ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరేలా ఉపాధి పనులు చేపట్టాలని సూచించారు.