TG: హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్ను రాష్ట్రపతి ముర్ము సందర్శించారు. 21వ వార్షికోత్సవం సందర్భంగా శాంతిసరోవర్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి శాంతిసరోవర్ ఆవరణలో మొక్క నాటారు.