HYD: బోరు బావుల చుట్టూ రెయిన్వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఏర్పాటు చేసుకుంటే భూగర్భజలం పెరిగి బోరు బావులు రీఛార్జ్ అవుతాయని HYD జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రజలకు సూచించారు. ప్రతి నివాసంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే రోజువారీ నీటి అవసరాలకు ఇబ్బందులు ఉండవన్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీరు సమృద్ధిగా సరిపోతుందని తెలిపారు.