నేటి యువత ఎదుర్కొంటున్న మానసిక సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎల్లప్పుడూ విచారంగా, ఏదో కోల్పోయినట్లు ఉంటారు. రోజువారి కార్యకలాపాలపై ఆసక్తి చూపరు. చేసే పనిపై శ్రద్ధ పెట్టరు. ఆకలి తగ్గుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతారు. అలసటగా, నీరసంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతారు. ఎక్కువగా మాట్లాడరు. వారికి నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి.