సిరియాలో ఇటీవల అమెరికా సిబ్బందిపై జరిగిన దాడిలో ముగ్గురు చనిపోయారు. దీంతో ఈ దాడికి అమెరికా ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలు, ఆయుధ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులను ప్రారంభించింది. దీనికి ‘ఆపరేషన్ హాక్ఐ స్ట్రైక్’ అనే పేరు పెట్టింది.