T20 ఫార్మాట్లో సౌతాఫ్రికాపై అత్యధికంగా 21 విజయాలు సాధించిన జట్టుగా భారత్ అవతరించింది. సఫారీలతో జరిగిన 5 T20 సిరీస్లో 3 విజయాలు సాధించడం ద్వారా భారత్ ఈ ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డ్ ఆస్ట్రేలియా పేరిట ఉండేది. సఫారీలను 19 సార్లు ఓడించిన కంగారూల జట్టు ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ప్రొటీస్పై 14 విజయాలతో వెస్టిండీస్, పాక్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.