మెదక్: TSPSC గురువారం విడుదల చేసిన గ్రూప్-3 పరీక్షా ఫలితాల్లో చిన్నశంకరంపేట మండల పరిధి గజగట్లపల్లికి చెందిన మధు వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగం సాధించాడు. తల్లిదండ్రులు శారద, యాదగిరిలు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమారుడు మధును కష్టపడి చదివించారు. తల్లిదండ్రుల కలను నెరవేర్చడం గర్వంగా ఉందని, గ్రూప్-1 ఉద్యోగం సాధించడమే లక్ష్యమని మధు తెలిపారు.