NRPT: వార్తల కవరేజికి వెళ్లిన జర్నలిస్టుపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని జిల్లా టీయూడబ్ల్యూజే, ఐజేయూ కార్యదర్శి అశోక్ శనివారం డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చేతకాక అక్రమ కేసులతో విద్యార్థులు, విద్యార్థి సంఘాల, జర్నలిస్టులపై డిపో మేనేజర్ కేసులు పెట్టడం తగదన్నారు. కేసులు ఉపసంహరించుకోవాలని లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.