SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర’ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్ మీదుగా కాశీబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.