AP: పెట్టుబడుల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖ భూములను అప్పనంగా కట్టబెడుతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై YCP నేత, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైరయ్యారు. ఈ భూకేటాయింపులపై కోర్టులు కూడా ప్రశ్నిస్తున్నాయని, ఇదంతా పెద్ద స్కామ్, విశాఖ కేంద్రం అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విశాఖ భూకబ్జాలపై CM ఎదుట పవన్ కళ్యాణే స్పందించారని పేర్కొన్నారు.