BDK: ఇల్లందు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఇవాళ సమావేశం అయ్యారు. ముందుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నను శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.