రేపు మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా YCP శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఓ ఆసక్తికర కటౌట్ సందడి చేస్తోంది. ఆ కటౌట్‌పై జగన్ సమరశంఖం పూరిస్తుండగా కేటీఆర్, కేసీఆర్ చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం కటౌట్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.