GDWL: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న అలంపూర్ క్షేత్రంలో అమ్మవారిని RBI డిప్యూటీ గవర్నర్ టీ. రబి శంకర్ శనివారం దర్శించుకున్నారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని అయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఈవో, అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.