నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డికి టీజీవో సంఘం అధ్యక్షుడు అలక కిషన్, కార్యదర్శి అమృతకుమార్, సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగుల సహకారం వల్లే ప్రశాంతంగా నిర్వహించడం సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో దేవీసింగ్, జగన్, దండుస్వామి, చందు, రామస్వామి పాల్గొన్నారు.