NZB: నాగేంద్ర యువసేన ఆధ్వర్యంలో భీమల్ కస్తూర్బాగాంధీ విద్యాలయం విద్యార్థులకు శనివారం క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో దుస్తులు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకరి సురేష్, నిచ్చేమొల్ల మహేష్, సయ్యద్ రెహమాన్, కంకణాల వంశీ కృష్ణ, సంపత్, శివతో పాటు నాగేంద్ర పాల్గోన్నారు.