NRPT: ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా డిసెంబరు 21న నారాయణపేట జిల్లా వ్యాప్తంగా సామూహిక ధ్యానం నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని హార్ట్ వెల్ నెస్ ప్రతినిధులు నారాయణరెడ్డి, శివకుమార్, నర్సింహారెడ్డి తెలిపారు. ధ్యానంతో మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం లభిస్తాయని వారు పేర్కొన్నారు.