కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకుడు శంకరయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఆయన ‘సింథసిస్ బయోలాజికల్ ఎవాల్యూషన్ అండ్ మాలిక్యులర్ డాకింగ్ స్టడీస్ ఆఫ్ న్యూ బెంజిమెడజోల్’ అనే అంశంపై పరిశోధన పూర్తిచేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, అధ్యాపకులు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.