జితేష్ శర్మకు తాజాగా ప్రకటించిన టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. దీంతో అతడి అభిమానులు SM వేదికగా సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘జితేష్ చేసిన తప్పేంటి? అతడిని జట్టు నుంచి ఎందుకు తొలగించారు..?’ అంటూ BCCIని ట్యాగ్ చేస్తూ నిలదీస్తున్నారు. తనకు వచ్చిన అవకాశాలను జితేష్ సద్వినియోగం చేసుకున్నప్పటికీ, WC వంటి మెగా టోర్నీకి అతడిని ఎంపిక చేయకపోవడంపై మండిపడుతున్నారు.