NZB: వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరకమైన ఆస్తుల కోసం ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ.. అందుబాటులోకి తెచ్చిన ‘ మీ డబ్బు- మీ హక్కు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన “మీ డబ్బు మీ హక్కు” శిబిరంలో అదనపు కలెక్టర్ పాలుగోన్నారు.