VZM: గ్రామ కంఠంలో ఉన్న భూములకు యాజమాన్య హక్కులు కల్పించడమే స్వామిత్వ పథకం ముఖ్య ఉద్దేశమని మాస్టర్ ట్రైనీ కోటంశెట్టి వెంకటరావు తెలిపారు. ఈ మేరకు కొత్తవలస ఎండీవో సమావేశ మందిరంలో మండలంలో ఉన్న పలు సచివాలయం ఉద్యోగులకు, VRO లకు ఇవాళ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎండివో రమణయ్య, డిప్యూటీ ఎంపీడీవో రాజశేఖర్ పాల్గొన్నారు.