MBNR: జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహం పరిసర ప్రాంతాలలో గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గద్దర్ తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారని అన్నారు. తొలి మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పోషించిన పాత్ర ఎనలేనిదని వెల్లడించారు.