NZB: జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని రెడ్‌క్రాస్ బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలను దిగ్విజయంగా నిర్వహించినందుకు పూలమొక్క ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను కలెక్టర్‌కు వివరించారు. తలసేమియాబాధితులకు అందిస్తున్న సేవలను కలెక్టర్‌కు తెలియజేశారు.